గురువారం 25 ఫిబ్రవరి 2021
Medak - Jan 26, 2021 , 00:17:33

పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ పనులు

పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ పనులు

డీఈవో రమేశ్‌కుమార్‌- పాఠశాలలను తనిఖీ-రికార్డులు పరిశీలన

కొల్చారం, జనవరి 25 : ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నందున పూర్తి స్థాయిల్లో శానిటైజేషన్‌ పనులు చేపట్టామని డీఈవో రమేశ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని వరిగుంతం, అంసాన్‌పల్లి జిల్లా పరిషత్‌ పాఠశాల్లో శానిటైజేషన్‌ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని జడ్పీ ఉన్నత పాఠశాలలను ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో శానిటైజేషన్‌ చేపడుతున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల, పాఠశాల సిబ్బంది ఉన్నారు. 

రాయిలాపూర్‌ పాఠశాలలో రికార్డులు పరిశీలన

కౌడిపల్లి, జనవరి 25 : మండల పరిధిలోని రాయిలాపూర్‌ ప్రాథమిక పాఠశాలను డీఈవో రమేశ్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పాఠశాలలోని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కృష్ణ పాల్గొన్నారు.

VIDEOS

logo