సోమవారం 08 మార్చి 2021
Medak - Jan 26, 2021 , 00:17:33

హరిత తూప్రాన్‌గా తీర్చిదిద్దుతా

హరిత తూప్రాన్‌గా తీర్చిదిద్దుతా

మనోహరాబాద్‌, జనవరి 25 : తూప్రాన్‌ మున్సిపల్‌ కేంద్రాన్ని హరితమయంగా మార్చేందుకు కృషి చేస్తానని మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌ అన్నారు. తూప్రాన్‌ పట్టణ కేంద్రంలోని పాత జాతీయ రహదారికి ఇరువైపులా 350 మొక్కలను సోమవారం నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆయా వార్డుల్లో స్వచ్ఛత, హరితహారంపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo