తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ నటిస్తున్న అరవైఐదో చిత్రానికి ‘బీస్ట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ జన్మదినం సందర్భంగా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ పోస్టర్లో చేతిలో తుపాకీ పట్టుకొని సరికొత్త లుక్‌లో విజయ్ కనిపిస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.