శుక్రవారం 05 మార్చి 2021
Medak - Jan 25, 2021 , 00:03:38

మందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలి

మందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలి

కొల్చారం జనవరి24:: అయోధ్యలో  రా మ మందిర నిర్మాణానికి కొల్చారం మండల వ్యాప్తంగా ఆదివారం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ మం జుల, జడ్పీటీసీ మేఘమాల పాల్గొన్నారు. కొల్చారంలో ముస్లింలు  రామ మందిర నిర్మాణానికి విరాళం అందజేసి ఆదర్శంగా నిలిచారు. వరిగుంతంలో జడ్పీటీసీ మేఘమాల  రామ మందిర నిర్మాణ కమిటీకి విరాళం అందజేయగా, కొల్చారంలో ఆరుగొండ మురళీధర్‌, ఆరుగొండ శ్రీధర్‌ రూ.10వేలు విరాళం అందజేశారు. 

నిజాంపేటలో...

నిజాంపేట,జనవరి24: రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిజాంపేట కమిటీ సభ్యులు చేపట్టిన నిధి సమర్పణ అభియాన్‌లో భాగంగా జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్‌ రూ.21,116 లను విరాళంగా అందజేశారు.

వెల్దుర్తి...

వెల్దుర్తి,జనవరి24:  మండలంలోని మానేపల్లిలోఆయోధ్యలో రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ చేశారు. వీహెచ్‌పీ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు రాజరాజేశ్వరీ దేవాలయంలో శ్రీరాముని విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్ర నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ నిధి సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటలక్ష్మి  , పలువురు పాల్గొన్నారు. 

 టేక్మాల్‌:

టేక్మాల్‌,జనవరి24: : అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి టేక్మాల్‌ మండలంలో నిధుల సేకరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా బొడ్మట్‌పల్లి గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తూ నిధుల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానికులు దశరథ్‌గౌడ్‌, పండరి, శ్రీనివాస్‌, గోపాల్‌, భూషణం, రోహిత్‌రెడ్డి, సాయిబాబా, విఠల్‌, శశిభూషణ్‌, చరణ్‌కుమార్‌ ఉన్నారు

నర్సాపూర్‌ రూరల్‌లో...

నర్సాపూర్‌ రూరల్‌,జనవరి 24: మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో హిందూ బంధువులు అయోధ్య లోని  రామమందిర నిర్మాణ నిధి సేకరణకై ర్యాలీని చేపట్టారు.  సోమవారం నుంచి విరాళాలు సేకరిస్తామని వారు పేర్కొన్నారు. 

ఖాజీపేట్‌లో శోభయాత్ర 

మండల పరిధిలోని ఖాజీపేట్‌ గ్రామంలో రామ మందిర నిర్మాణ నిధికై  శోభయాత్రను చేపట్టారు ఈ కార్యక్రమంలో హిందూ సభ్యులు  పాల్గొన్నారు. 

VIDEOS

logo