ఘనంగా నేతాజీ జయంతి

నేతాజీ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్
నిజాంపేటలో పూలమాలవేసిన జిల్లా విద్యాధికారి రమేశ్
రామాయంపేట/నిజాంపేట/మనోహరాబాద్/ తూప్రాన్, చేగుంట, జనవరి23: రామాయంపేట పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహించారు. పట్టణంలోని సుభాష్ రోడ్డులో ఉన్న విగ్రహానికి బజరంగ్దళ్, విశ్వహిందూపరిషత్ నాయకులతో పాటు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ సరాప్ యాదగిరి, సుభాష్ యూత్ అధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
నిజాంపేట మండలంలో..
మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా విద్యాధికారి రమేశ్, జడ్పీటీసీ పంజ విజయ్‌కుమార్, సర్పంచ్ గెరుగంటి అనూష, మాజీ పీఏసీఎస్ చైర్మన్ కిష్టారెడ్డి, సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో పూలమాల వేసి నివాళులలర్పించారు.
మనోహరాబాద్, తూప్రాన్‌లో..
మండల కేంద్రంలో వివేకానంద యూత్ అధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తూప్రాన్ మండల కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి యూత్ సభ్యులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.శివ్వంపేట మం డలంలోని నేతాజీ చిత్రపటానికి ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్ పూలమాల వేశారు.
చేగుంట, నార్సింగి మండలంలో..
చేగుంట మండలం వడియారంలో ఉపాధ్యాయ సంఘం నేత తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేశారు. చేగుంట మండల కేంద్రంలో ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ ముదం శ్రీనివాస్ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు.
పెద్దశంకరంపేటలో...
పెద్దశంకరంపేట, జనవరి23: సుభాష్ చంద్రబోస్ జయంతిని ఆర్వీఏస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీచౌరస్తా వద్ద ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, సర్పం చ్ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీపంతులు, ఆర్వీఏస్ స్వచ్ఛందసంస్థ అధ్యక్షుడు గంగారెడ్డి పాల్గొన్నారు.
టేక్మాల్...
టేక్మాల్, జనవరి23: మండల కేంద్రమైన టేక్మాల్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జరుపుకొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సిద్దయ్య, యువజన సంఘం నాయకులు ఉన్నారు. బర్ధీపూర్ గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో నేతాజీ జయంతి నిర్వహించారు.
పాపన్నపేట...
పాపన్నపేట,జనవరి23:: మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్నపేటలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గురుమూర్తిగౌడ్, ఎస్సై ఆంజనేయులు , ఎంపీటీసీ సభ్యులు ,బీజేపీ మండల అధ్యక్షుడు , గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పల్లె.. ప్రగతి బాట పట్టిందో..’
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్