బుధవారం 03 మార్చి 2021
Medak - Jan 24, 2021 , 00:16:07

కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుతో రైతులకు లాభదాయకం

కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుతో రైతులకు లాభదాయకం

కేంద్ర  హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

కౌడిపల్లి, జనవరి 23: కృషివిజ్ఞాన కేంద్రం ఏర్పాటుతో రైతులకు ఎంతో లాభదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం తునికి శివారులోని డాక్టర్‌ రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృషివిజ్ఞాన కేంద్రం నూతన అడ్మిన్‌స్ట్రేషన్‌ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కేవీకేలో పండిస్తున్న ఆర్గానిక్‌ వ్యవసాయ పంటలు, పండ్ల తోటలు, ఆర్గానిక్‌ ఎరువుల తయారీ పద్ధతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులనుద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. తునికిలో కేవీకే ఏర్పాటు చేయడంతో ఇక్కడి ప్రాంత చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం  సర్కార్యవహ్‌ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ బాయాజి జోషి, సెక్రటరీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ జన్ల్‌,్ర ఐసీఏఆర్‌ డాక్టర్‌ త్రిలోచన్‌ మొహపాత్ర, డిప్యూటీ డైరెక్టర్‌ జన్ల్‌,్ర ఐసీఎఆర్‌ డాక్టర్‌ ఏకే సింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ కేవీకే సత్ఫలిలాలను కొనియాడారు. కేవీకే అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్‌.ప్రతాప్‌రెడ్డి రూ.30 లక్షల చెక్కును కేవీకే చైర్మన్‌ వినోద్‌రావుకు అందజేశారు. కార్యక్రమంలో ఏకలవ్య ఫౌండేషన్‌ చైర్మెన్‌ వేణుగోపాల్‌రెడ్డి, కేవీకే చైర్మన్‌ వినోద్‌రావు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌. వి.ప్రవీణ్‌రావు, డైరెక్టర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ కాటన్‌ రీసెర్చ్‌ నాగపూర్‌ డాక్టర్‌ వై.జి.ప్రసాద్‌, నర్సాపూర్‌ ఆర్డీవో సాయిరాం, తాసిల్దార్‌ రాణాప్రతాప్‌, సర్పంచ్‌ సాయిలుతో పాటు కేవీకే శాస్త్రవేత్తలు, సిబ్బంది పాల్గొన్నారు.  

VIDEOS

logo