జోరందుకున్న యాసంగి

వెల్దుర్తి , జనవరి21: వానకాలంలో సమృద్ధిగా కురిసిన వర్షాలతో యాసంగిసాగు పనులు జోరందుకున్నాయి. మండలంలో వరి ప్రధాన పంట కావడంతో రైతులు పెద్ద ఎత్తున వరిసాగును చేపట్టగా, వరినాట్లు ప్రారంభం అయ్యాయి. గత వానకాలంలో 14 వేల ఎకరాల్లో వరిపంట సాగు కాగా, ఈ యాసంగిలో 11 వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనాలను సిద్ధ్దం చేశారు. వరిసాగులో తెగుళ్ల నుంచి పంట రక్షణ కోసం సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, లేకుంటే తెగులు సోకి పంట నాశనం అయ్యే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. నీటి యాజమాన్యం, తెగుళ్లు రాకుండా నివారణ చర్యలను ఏవో మాలతి వివరించారు.
- వరిపంటను సాగు చేసే పొలాన్ని నాటు వేసే 10-15 రోజుల ముందు కేజీవీల్స్ , రోటోవేటర్తో పొలాన్ని దమ్ము చేసి, చదును చేసుకోవాలి.
- నాటు వేసేటప్పుడు రెండు లేదా మూడు వరి నాటుమొక్కలను పై పైన నాటుకోవాలి. పై పైన నాటుకోవడంతో అధిక దిగుబడులు సాధించవచ్చు.
- ప్రతి రెండు మీటర్ల నాటుకు 20 సెంటీమీటర్ల కాలిబాటను వదలుకోవాలి. దోమపోటు ఉధృతిని తగ్గించడంతో పాటు ఎరువులు చల్లడానికి, పిచికారీ చేయడానికి వీలుగా ఉంటుంది.
నీటియాజమాన్యం..
నాటు వేసిన మరుసటి రోజు నుంచి 3 నుంచి 4 రోజుల వరకు పొలంలో 5 సెంటిమీటర్ల మేర నీటిని పారించాలి.
కలుపు నివారణ..
వరి నాటిన 40 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నాటిన 25 తరువాత కలుపును తీసుకోవాలి. వరిలో ముఖ్యంగా కాండం తొలుచు పురుగు, అగ్గితెగులు, దోమపో టు, ఎండుతెగులు సోకే ప్రమా దం ఉంది. రైతుల జాగ్రత్తలు చేపట్టి, అధికారుల సూచనలను పాటించాలని అన్నారు. తెగులు సోకిన, పంట నష్టం వాటిల్లిన అధికారులను సంప్రదించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
తాజావార్తలు
- సీసీఆర్టీలో ఈ లెర్నింగ్ వర్క్షాపు
- జైళ్ల సిబ్బంది, ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
- దివ్యాంగులకు కొత్త జీవితం
- సంద చెరువు సుందరీకరణ
- విశ్వ నగరానికిప్రాంతీయ బాట
- తడిచెత్తతో సేంద్రియ ఎరువు
- ఫలక్నుమా ఆర్ఓబీ వద్ద ట్రాఫిక్ మళ్లింపు
- ఉద్యోగ అవకాశాలు కల్పించేది టీఆర్ఎస్సే..
- దోమల నివారణకు చర్యలు
- వేసవి దృష్ట్యా నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు