సోమవారం 08 మార్చి 2021
Medak - Jan 21, 2021 , 00:06:38

ఓపెన్‌ స్కూల్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ఓపెన్‌ స్కూల్‌ను సద్వినియోగం చేసుకోవాలి

పాపన్నపేట, జనవరి20: చదువు మధ్యలో మా నివేసిన వారికి ఓపెన్‌ స్కూల్‌ ఒక వరమని ఉమ్మ డి జిల్లా కో ఆర్డినేటర్‌ వెంకటస్వామి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాల ను పరిశీలించారు. అనంతరం ఆయన పదోతరగతి, ఇంటర్మీడియట్‌ ప్రవేశాల గోడ పత్రికను  ఆ ష్కరించి మాట్లాడుతూ ఓపెన్‌ అడ్మిషన్లకు ఈనెల 25 వరకు అపరాధ రుసుముతో గడువు ఉందని దానిని అభ్యాసకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4285 అడ్మిషన్లు అయ్యాయని, వీటి సంఖ్య మ రింత పెంచడంలో కో ఆర్డినేటర్లు చేయూత అం దిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కా ర్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశం, పాఠశాల ఓపెన్‌స్కూల్‌ ఇన్‌చార్జి  వీరే శం, రమేశ్‌ చౌదరి, స్వామి, శశికుమార్‌రెడ్డి, చం ద్రమోహన్‌, అశోక్‌, సుభాశ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo