శనివారం 06 మార్చి 2021
Medak - Jan 20, 2021 , 00:10:52

క్యాలెండర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

క్యాలెండర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

మెదక్‌ రూరల్‌, జనవరి 19 : టీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్‌, మెదక్‌ నియోజకవర్గ అధ్యక్షుడు రంజిత్‌గౌడ్‌, నాయకులు నవీన్‌, లింగంరాజ్‌, మల్లేశం, దుర్గాగౌడ్‌, శ్రవణ్‌గౌడ్‌, ముస్తఫా, సాయికిరణ్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో..

మెదక్‌టౌన్‌, జనవరి19 : ఉమ్మడి మెదక్‌ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ క్యాలెండర్‌ను మంగళవారం పశుగణాభివృద్ధ్ది సంస్థ చైర్మన్‌ దేవునూరి తిరుపతి, పశుగణాభివృద్ధ్ది కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ రాంజి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి విజయశేఖర్‌ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సహాయ సంచాలకులు డాక్టర్‌ వెంకటయ్య, కమిటీ సభ్యులు నర్సింహారెడ్డి, రాజు, వెంకటలక్ష్మి గోపాలమిత్ర పర్యవేక్షకులు శ్రీనివాస్‌రెడ్డి,అర్జునయ్య, తుక్కరెడ్డి , సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo