గురువారం 04 మార్చి 2021
Medak - Jan 19, 2021 , 00:03:08

ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగింది

ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి 

మనోహరాబాద్‌, జనవరి 18: ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలోనే జరిగిందని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తూప్రాన్‌ మండల కేంద్రంలో జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, మాజీ ఫుడ్స్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డితో కలిసి తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాలకు చెందిన 73 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. అలాగే, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కూలిపోయిన 14 ఇండ్లకు వచ్చిన ఆర్థిక సాయం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పేదింటి ఆడపడుచుల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లను అందించి ఇంటి పెద్ద కొడుకుగా మారాడన్నారు. తెలంగాణలోని ప్రతి పల్లె డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాలతో పాటు అనేక అభివృద్ధి పనులతో పట్టణాలను తలదన్నే విధంగా తయారయ్యాయన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడంలో మునుపెన్నడూ లేనివిధంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పని చేశారని కొనియాడారు. అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా నేడు తెలంగాణ నిలిచిందన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలల్లో ఎక్కడ కూడా మనలాంటి పథకాలు లేవని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నాయకులు సాధ్యమైతే కేంద్రం నుంచి రాష్ర్టానికి ప్రత్యేక నిధులు తెప్పిండానికి కృషి చేయాలి తప్ప, అనవసర విమర్శలు చేయవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు బాలకృష్ణారెడ్డి, ఎంపీపీలు పురం నవనీతరవి, కల్లూరి హరికృష్ణ, గడ్డి స్వప్నవెంకటేశ్‌, వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్‌ సుధకార్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహిపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్‌, తూప్రాన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేంద్రగౌడ్‌, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

అభివృద్ధి పనులు పూర్తి చేయండి.. 

- ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మనోహరాబాద్‌ అతిథి గృహంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, మాజీ ఫుడ్స్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డితో కలిసి తూప్రాన్‌, మనోహరాబాద్‌, చేగుంట మండలాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆయా గ్రామాల్లో మినీ ఫంక్షన్‌హాల్‌ల నిర్మాణాలు చేపట్టని కాంట్రాక్టర్లను రద్దు చేసి ఇతరులకు అప్పగించాలన్నారు. కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా శివ్వంపేట మండలం నుంచి పోతారం, పర్కిబండ, గౌతోజిగూడెం గ్రామాలు మనోహరాబాద్‌ మండలంలో కలిశాయని, అవి నర్సాపూర్‌ నియోజకవర్గంలో ఉండటంతో గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి ఎలాంటి నిధులు అందడం లేదని ఎంపీ దృష్టికి తేగా ఆయా గ్రామాలకు ఎంపీ కోటా నుంచి నిధులు మంజూరయ్యేలా చేస్తానన్నారు.

VIDEOS

logo