సోమవారం 08 మార్చి 2021
Medak - Jan 18, 2021 , 00:14:23

నేడు టీఎన్‌జీవోల కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

నేడు టీఎన్‌జీవోల  కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

మెదక్‌, జనవరి 17 :  జిల్లా టీఎన్‌జీవోల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం టీఎన్‌జీవో భవన్‌లో సోమవారం మధ్యాహ్నం 1 గంటకు నిర్వహిసున్నామని  జిల్లా అధ్యక్షుడు నరేందర్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి  మంత్రి  హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ హేమలతా శేఖర్‌గౌడ్‌, టీఎన్‌జీవోల రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు.  డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణతో పాటు ఉద్యో గ విరమణ పొందిన శ్యాం రావ్‌ అభినందన స భ ఉంటుందని వారు  అన్నారు. జిల్లాలోని ఉద్యోగులు ఈ సమావేశానికి  హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా టీఎన్‌జీవో అధ్యక్షుడు నరేందర్‌ విజ్ఞప్తి చేశారు.  

VIDEOS

logo