మంగళవారం 02 మార్చి 2021
Medak - Jan 14, 2021 , 00:03:28

ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలి

ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలి

అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

మెదక్‌, జనవరి 13: మెదక్‌ జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి పర్వదినం సందర్బంగా మంత్రి తన్నీరు హరీశ్‌రావు  సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్బంగా మాట్లాడుతూ....సకల సంపదలతో  సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని ... ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో వృద్ధి చెందిందన్నారు.  ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు సమృద్దిగా అందుతున్నాయన్నారు. ఈ సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో నిత్యం కాంతులు వెదజల్లాలి అని భగవంతుడిని కోరుతున్నానన్నారు. ప్రజలందరికీ శుభం చేకూరాలని ఈ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరారు.  

VIDEOS

logo