శనివారం 23 జనవరి 2021
Medak - Dec 05, 2020 , 02:48:27

జీహెచ్‌ఎంసీ విజయంపై టీఆర్‌ఎస్‌ సంబురాలు

జీహెచ్‌ఎంసీ విజయంపై టీఆర్‌ఎస్‌ సంబురాలు

పెద్దశంకరంపేట: హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు వహించిన శేర్‌లింగంపల్లి 106 స్థానం అభ్యర్థి రాగం నగేందర్‌ యాదవ్‌ మూడువేల మెజార్టీతో  గెలువడంతో మండల టీఆర్‌ఎస్‌ నా యకులు శనివారం సంబురాలు జరుపుకున్నారు. టీఆర్‌ఎస్‌ అత్యధిక స్థానాలు గెలుపొంది మేయర్‌ స్థానాన్ని కైవసం చేసుకుంటుందన్నారు.అనంతరం  స్వీట్లు పంచుకున్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ  శ్రీనివాస్‌, మండల రైతుబంధు అధ్యక్షుడు సురేశ్‌గౌడ్‌, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, సర్పంచ్‌లు నరేశ్‌, ప్రకాశ్‌, ఎంపీటీసీ సుభాశ్‌ గౌడ్‌, స్వప్న రాజేశ్‌,  ఎలిశ మ్మ, నాయకులు భాను, శంకర్‌రావు, రమేష్‌ ఉన్నారు


logo