ఆదివారం 17 జనవరి 2021
Medak - Dec 04, 2020 , 00:15:33

మలి దశ ఉద్యమంలో తొలి అమరుడు

మలి దశ ఉద్యమంలో తొలి అమరుడు

టేక్మాల్‌: తెలంగాణ మలి దశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి టేక్మాల్‌లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మండ ల అధ్యక్షుడు వీరప్ప మాట్లాడుతూ ఉద్య మ సమయంలో యువత, విద్యార్థుల పా త్రను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సిద్ధయ్య, నాయకులు సత్యం, కేశవులు, మురళి  ఉన్నారు.

 రామాయంపేటలో..

 రామాయంపేట: రామాయంపేట పట్టణంలోని శ్రీకాంతాచారి వర్ధంతి  పట్టణంలోని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో  ఆయన చిత్రపటానికి పూలమాలవేసి  నివాళులర్పించారు. అనంతరం స్వర్ణకార సం ఘం అధ్యక్షుడు సుంకోజు దామోదరాచారి విలేకరులతో మాట్లాడారు.శ్రీకాంతాచారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయలన్నారు.ఈ కార్యక్రమంలో కిష్టాపురం రామకృష్ణ, ముకుందం, లక్ష్మీనారాయణచారి, శంకరాచారి, నాగరాజుచారి, యాదగిరి, కిరణ్‌ తదితరులున్నారు.

అల్లాదుర్గంలో.. 

అల్లాదుర్గం: రేగోడ్‌ మండలంలో  శ్రీకాంతాచారి వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి, జైరావు, ప్రభాకర్‌, తుకారం, అనంతప్ప, మల్లన్న, అంజయ్య, రాములు పాల్గొన్నారు.