యాసంగికి సింగూరు నీరు

- రైతులు పంటలను సాగు చేసుకోవచ్చు
- సమావేశానికి గైర్హాజరైన అధికారులకు మెమోలు జారీ చేయాలి
- మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
హవేళిఘనపూర్: వర్షాలు సమృద్ధిగా కురి సి సింగూరు నిండడంతో మంజీరా ప్రాంతంలోని రైతులు యాసంగి పంటలు పూర్తిగా సాగు చేసుకోవాలని, అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గురువారం ఎంపీపీ శేరి నారాయ ణరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిసినందున పంటల సాగుకు రైతులు సన్నద్ధం కావాలన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకున్నప్పటికీ అందకపోవడంతో పనులు నిలిచిపోయాయని ఎంపీ పీ శేరి నారాయణరెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పం దిస్తూ కలెక్టర్‌తో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినా బిల్లులు రావడం లేదని ఎంపీపీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాగా అందేలా చూస్తానని హామీనిచ్చారు. మం డలంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి వెంటనే చెక్కులు అందజేయాలని ఎంపీడీవో సాయిబాబాను ఆదేశించారు. మండల సర్వసభ్య సమావేశానికి హాజ రు కానీ ట్రాన్స్‌కో, హార్టికల్చర్, ఐసీడీఎస్, ఆర్అండ్బీ అధికారులకు మెమోలు జారీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వెంకటేశం, వైస్ ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్, ఎంపీడీవో సాయిబాబా, ఏపీవో రాజ్‌కుమార్, ఏవో నాగమాధురి, మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.