మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే

బైక్‌ను ఢీకొట్టిన బస్సు ముగ్గురికి తీవ్ర గాయాలు
మెరుగైన వైద్యం అందించాలని సూచన
కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబీకులు
చిన్నశంకరంపేట : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని దవాఖానలో చేర్పించి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యా న్ని అందించాలని ఎమ్మెల్యే మెదక్ ఏరియా దవాఖాన వైద్యులకు సూచించారు. బుధవారం మెదక్ మండలం ఖాజీపల్లి గ్రామానికి చెందిన వీరబోయిన లాలు, భార్య భవానీ, కుమారుడు భరత్ బైక్‌పై అత్తగారింటికి (చేగుంట మండలం వడియారం గ్రామానికి) బయలుదేరాడు. కొర్విపల్లి గ్రామశివారులోకి రాగానే మెదక్ నుంచి చేగుంట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఓవర్ టేక్ చేస్తూ తగలడంతో వారు కింద పడిపోయారు. లాలు చేతి విరిగి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎనిమిది నెలల గర్భవతి అయిన భవానీ, చిన్నారి భరత్‌కు తీవ్రగాయాలయ్యా యి. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. క్షతగాత్రులను చూసి వెంటనే వాహనాన్ని ఆపి, తీవ్రంగా గాయపడిన వారిని 108 వాహనంలో మెదక్ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. పద్మాదేవేందర్‌రెడ్డి ఘటనా స్థలం నుంచే ఫోన్లో వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దగ్గరుండి దవాఖానకు తరలించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై మహ్మద్‌గౌస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- రన్ వే పై చిరుత రయ్.. రయ్...! వీడియో వైరల్... !
- విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఎజెండా : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
- మరో 5జీ ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో..ప్రీ-బుకింగ్స్ ప్రారంభం
- వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కాజల్
- సహారా ఎడారిలో ఈ వింత చూశారా?
- బూర్గుల మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం
- గూగుల్ కష్టమర్లకు గుడ్ న్యూస్..!
- బర్డ్ ఫ్లూ నిజంగా ప్రమాదమేనా...?
- ఇక సుంకాల మోతే: స్మార్ట్ఫోన్లు యమ కాస్ట్లీ?!
- లైట్..కెమెరా..యాక్షన్..'ఖిలాడి' సెట్స్ లో రవితేజ