శుక్రవారం 15 జనవరి 2021
Medak - Dec 01, 2020 , 01:37:00

ఏడుపాయల్లో లక్ష దీపోత్సవం

ఏడుపాయల్లో లక్ష దీపోత్సవం

  • ప్రారంభించిన  ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
  • పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు

పాపన్నపేట:  ఏడుపాయల వనదుర్గభవానీమాత సన్నిధిలో కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని సోమవారం సాయంత్రం లక్ష దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ఎమ్మెల్యే  పద్మాదేవేందర్‌రెడ్డి హాజరై  ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే దుర్గాభవానీ మాత దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి తెప్పోత్సవం నిర్వహించారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని లక్ష దీపోత్సవం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలను వెలింగించి తమ భక్తిని చాటుకున్నారు.  భక్తులు మంజీరానది తీరంతో పాటు ఆలయానికి వెళ్ళే దారికి ఇరువైపులా  అమ్మవారి ఆలయ ప్రాంగణంలో, రాజాగోపురం వద్ద,భక్తులు  దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట ఎంపీపీ చందనప్రశాంత్‌రెడ్డి, ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్‌, మాజీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, ఆలయ సిబ్బంది వేద బ్రాహ్మణులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.

నర్సాపూర్‌ రూరల్‌లో..

నర్సాపూర్‌ రూరల్‌: మండల పరిధిలోని రుస్తుంపేట్‌ గ్రామంలో ఆత్మానంద ఆశ్రమంలో సోమవారం కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి రాజయోగి వెంకటస్వామి మాట్లాడుతూ కార్తిక పౌర్ణ మి పురస్కరించుకొని ఆశ్రమంలోని లక్ష్మీనరసింహస్వామికి పంచామృతాభిషేకం, భవానీ స్పటిక రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, తులసి కల్యాణం, లక్ష దీపోత్సవం నిర్వహించామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాధవానంద సరస్వతీ స్వామి హాజరైన్నారు ఆశ్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీపాలను వెలిగించారు. 

 మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని చిత్తారమ్మ ఆలయం వద్ద సోమవారం కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని వంజరి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ  ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహికులు గంట కృష్ణ, శ్రీరాములు, పాల్గొన్నారు.

చేగుంటలో 

చేగుంట: కార్తిక పౌర్ణమి పురష్కరించుకొని చేగుంట, నార్సింగితో పాటు పలు గ్రామాల్లో భక్తులు పూజలు చేశారు. చేగుంటలోని శివాలయంలో, కర్నాల్‌పల్లి ఎల్లమ్మ దేవాలయంలో, చిట్టొజిపల్లిలోని స్వయంభూ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో కి సోమవారం ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేశారు. దేవాలయల్లో భక్తులు కార్తిక దీపాలను వెలిగించారు.

వెల్దుర్తిలో

వెల్దుర్తి: కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని మండల వ్యా ప్తంగా భక్తులు దేవాలయాల్లో ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెలంగాణ కాశి క్షేత్రంగా పేరుగాంచిన  బస్వా పూర్‌ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పత్రి, పంచా మృతాలతో అభిషే కాలు చేసి,  పూలతో అలం కరించారు. సాయంత్రం  భక్తులు దేవాలయాల్లో పూజలు నిర్వహించి దీపాలను వివిధ అకృతుల లో వెలిగించి, పూలతో అలంకరించారు.