మంగళవారం 26 జనవరి 2021
Medak - Dec 01, 2020 , 01:32:51

ఆర్సీపురం, భారతీనగర్‌లో 400 మంది పోలీసులతో పర్యవేక్షణ

ఆర్సీపురం, భారతీనగర్‌లో 400 మంది పోలీసులతో పర్యవేక్షణ

రామచంద్రాపురం : సర్కిల్‌ 22 పరిధిలోకి వచ్చే 111 భారతీనగర్‌ డివిజన్‌, 112 ఆర్సీపురం డివిజన్లు  సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి వస్తాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రెండు డివిజన్‌ల్లో 400 మందితో పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఒక ఏసీపీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, 20 మంది ఎస్‌ఐలు, 377 మంది పోలీసు సిబ్బందితో ఎన్నికల పర్యవేక్షిస్తారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వర్‌ తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.


logo