ఆదివారం 17 జనవరి 2021
Medak - Nov 28, 2020 , 00:32:57

డైట్‌ సెకండియర్‌ పరీక్షలు

డైట్‌ సెకండియర్‌ పరీక్షలు

ప్రారంభంకొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ  పరీక్ష నిర్వహణ 

మెదక్‌టౌన్‌ : డీఎడ్‌ ద్వితీయ సంవత్సర  పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రం మెదక్‌లో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో డైట్‌ పరీక్ష  కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  డీఎడ్‌  విదార్థులు మెత్తం 212 మందికి 208 మంది పరీక్షకు హాజరయ్యారు.  డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎస్‌ఈ) మెత్తం విదార్థులు 31మందికి  31 మంది పరీక్షకు హాజరయ్యారు. 

కరోనా నేపథ్యంలో  అభ్యర్థులకు శానిటైజర్‌తో పాటు థర్మల్‌ స్రీనింగ్‌ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. భౌతిక దూరం పాటిస్తూ ఉదయం 9 నుంచి మధాహ్నం12 గంటల వరకు  పరీక్ష జరిగింది. డీఈవో రమేశ్‌ కూమర్‌ పరీక్ష  కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌ అధికారి రేఖ, డిపార్ట్‌మెంటల్‌ అధికారి బాలకృష్ణ  ఉన్నారు.