గురువారం 21 జనవరి 2021
Medak - Nov 27, 2020 , 00:16:54

ఉద్యోగ వ్యతిరేక విధానాలు వీడాలి

ఉద్యోగ వ్యతిరేక విధానాలు వీడాలి

మెదక్‌ కలెక్టరేట్‌ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చేపట్టిన దేశ వ్యాప్త సమ్మెకు మద్దతుగా జిల్లా టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు మేడిశెట్టి శ్యాంరావు, కార్యదర్శి దొంత నరేందర్‌  ఆధ్వర్యంలో మెదక్‌ కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్‌ ఏవోకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మంగ మనోహర్‌, నర్సాపూర్‌ యూనిట్‌ అధ్యక్ష, కార్యదర్శులు రాజ్‌కుమార్‌, శేషాచారి, ఎండీ ఫజల్‌, నాగరాజుగౌడ్‌, శివాజీ, ఎండీ ఇక్బాల్‌పాషా, ప్రభుదాస్‌, ప్రసాద్‌, చింటు, శ్రీకాంత్‌, నరేశ్‌, అశోక్‌, పరమేశ్‌, అజీజ్‌పాషా, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.logo