గురువారం 28 జనవరి 2021
Medak - Nov 26, 2020 , 00:15:52

ఆర్సీపురంలో జోరుగా టీఆర్‌ఎస్‌ ప్రచారం

ఆర్సీపురంలో జోరుగా టీఆర్‌ఎస్‌ ప్రచారం

రామచంద్రాపురం : ఆర్సీపురం 112 డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోంది. కార్పొరేటర్‌ అభ్యర్థి బూరుగడ్డ పుష్పానగేశ్‌ ఇంటింటి ప్రచారానికి డివిజన్‌ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కులసంఘాలు, వర్తక సంఘాలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికే మద్దతు తెలుపుతున్నాయి. టీఆర్‌ఎస్‌ శ్రేణుల ప్రచారాలు హోరెత్తుతుంటే ప్రతిపక్ష పార్టీల ప్రచారాలు డీలా పడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుష్పానగేశ్‌ ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్‌లోని ఏ కాలనీకి వెళ్లినా ప్రజలు ఆప్యాయంగా ఆదరిస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రచారానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తున్నదన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ప్రజలు తనపై నమ్మకముంచి డిసెంబర్‌ 1న జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, ఐదేండ్లు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు.logo