శనివారం 16 జనవరి 2021
Medak - Nov 24, 2020 , 00:03:35

పుష్ప నగేశ్‌కు మద్దతుగా ‘తుమ్మల’ ప్రచారం

పుష్ప నగేశ్‌కు మద్దతుగా ‘తుమ్మల’ ప్రచారం

రామచంద్రాపురం: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రామచంద్రాపురం డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుష్ప నగేశ్‌కు మద్దతుగా సోమవారం అమీన్‌పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి పుష్ప నగేశ్‌ను గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుందన్నారు.  ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ కృష్ణ, నాయకులు చంద్రశేఖర్‌, గోవర్ధ్దన్‌ రెడ్డి, శ్రీనివాస్‌, ప్రతాప్‌ రెడ్డి, మాధవరెడ్డి, మహేందర్‌ రెడ్డి, అంజి, రాంరెడ్డి, నరసింహారెడ్డి, భాస్కర్‌ రెడ్డి,  కాలనీవాసులు పాల్గొన్నారు.