శనివారం 28 నవంబర్ 2020
Medak - Nov 22, 2020 , 00:21:36

టీఆర్‌ఎస్‌తోనే అన్నివర్గాలకు సంక్షేమం

టీఆర్‌ఎస్‌తోనే అన్నివర్గాలకు సంక్షేమం

రామచంద్రాపురం :  టీఆర్‌ఎస్‌తోనే అన్నివర్గాలకు సంక్షేమం సాధ్యమవుతుందని టీఆర్‌ఎస్‌ నాయకులు బూరుగడ్డ నగేశ్‌, కౌన్సిలర్‌ చంద్రారెడ్డి అన్నారు. ఆర్సీపురం 112 డివిజన్‌లోని అశోక్‌నగర్‌లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలిసి టీఆర్‌ఎస్‌ చేస్తున్న   అభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. 

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి..

ప్రభుత్వ సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయని తెలిపారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని అన్నారు. గతంలో పరిశ్రమలకు పవర్‌ హాలీ డే ఉండేదని, ఇప్పుడు 24గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో పరిశ్రమలు నిరంతరం నడువడంతో కార్మికులకు ఓటీలు దొరుకుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిస్థాయి విశ్వాసంతో ఉన్నారని, ఆర్సీపురం డివిజన్‌లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు.  ప్రచారంలో శ్రీపతి రవీందర్‌, నర్సింగ్‌రావు తదితరులు ఉన్నారు.