‘ధరణి’తో పని సులువు

తహసీల్ కార్యాలయాలను సందర్శించిన ఆర్డీవో శ్యామ్‌ప్రకాశ్, ఇన్చార్జి ఆర్డీవో సాయిరాం
చిలిపిచెడ్: చిలిపిచెడ్ మండలం ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మండలంలోని సోమవారం మూడు గిఫ్ట్ డీడ్, రిజిస్ట్రేషన్ ఒక్కటి, పౌతీ మార్పు చేసినట్లు తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ స్టీఫిన్ తెలిపారు. కొనుగోలుదారుడు సోమవారం ఉదయం మీసేవ కేంద్రంలో స్లాట్‌బుక్ చేసుకున్నారు.అనంతరం అమ్మకందారు, కొనుగోలుదారు వచ్చి తహసీల్దార్,జాయింట్ సబ్ రిజిస్ట్రార్ స్టీఫిను కలిశారు. తహసీల్దార్ రికార్డులను పరిశీలించి..వారి బయోమెట్రిక్‌తో వేలిముద్రలు తీసుకున్నారు. ఈ భూమిని అమ్మకం దారుడి పాస్‌బుక్ నుంచి తొలిగించి, కొనుగోలుదారుడి పాస్‌బుక్‌లో ఎంట్రీచేశారు.అనంతరం రిజిటస్ట్రేషన్కు సంబంధించిన పత్రాలను కొనుగోలుదారుడికి అందజేశారు.ఈ ప్రక్రియ అంతా దాదాపు 20 నిమిషాల్లో అధికారులు పూర్తి చేశారు.త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తికావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఆపరేటర్ గోవర్దన్‌రెడ్డి ఉన్నారు.
తక్కువ సమయంలో
రిజిస్ట్రేషన్ల్లు
వెల్దుర్తి: రైతుల సౌలభ్యం కోసం ప్రారంభించిన ధరణి పోర్టల్ డివిజన్ పరిధిలో విజయవంతంగా కొనసాగుతున్నదని తూప్రాన్ ఆర్డీవో శ్యామ్‌ప్రకాశ్ అన్నారు. వెల్దుర్తి తహసీల్ కార్యాలయంలో జరుగుతున్న భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ అనంద్రావుతో కలిసి పరిశీలించి, రిజిస్ట్రేషన్లకు వచ్చిన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ధరణిపోర్టల్ తో సులభంగా, తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుందని, దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. నేడు చేపట్టిన ధరణితో రిజిస్ట్రేషన్ ఒక్క రోజులో పూర్తి కావడం, గంట వ్యవధి లో పట్టాపాసుపుస్తకాలను తీసుకొని వెళ్తున్నారన్నారు. డివిజన్ పరిధిలో ని ఐదు మండలాల్లో వందకు పైగా రిజిస్ట్రేషన్లు అయ్యాయని, ఎక్కడ ఎలాంటి సాంకేతిక లో పాలు లేవని అన్నారు.
విజయవంతంగా ధరణి పోర్టల్
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ డివిజన్ వ్యాప్తం గా ధరణి సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయ ని ఇన్చార్జి ఆర్డీవో సాయి రాం పేర్కొన్నారు. నర్సాపూర్ తహసీల్ కార్యాలయంలో ధరణి పోర్టల్‌తో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఇన్చార్జి ఆర్డీవో సాయిరాం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ధరణి పోర్టల్‌లో ఉన్న పట్టా భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఆపకూడదని తెలిపారు. డివిజన్ వ్యాప్తంగా నేటి వరకు 179 స్లాట్లు బుక్ కాగా 178 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని వెల్లడించారు. శివ్వంపేట్ మండలంలో కొన్ని కారణాల వల్ల ఒక రిజిస్ట్రేషన్ ఆగిపోయిందని అన్నారు. 10వ తేదీ వరకు సాదాబైనామాలు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని సూచించారు.
తర్వాత రిజిస్ట్రేషన్లు జరుగవని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. 72 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 400 మంది రైతుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మాలతి పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఢిల్లీ గణతంత్ర వేడుకలకు గిరిజన మహిళ..!
- టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లపై పర్మినెంట్ బ్యాన్!
- కూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి
- కల్నల్ సంతోష్‌కు మహావీర చక్ర
- మేక పిల్లను రక్షించబోయి యువకుడు మృతి
- తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం
- మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు
- రాజస్థాన్‌లో పెట్రోల్ భగభగ.. లీటర్ @ రూ.100
- పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- అభిమాని పెళ్లిలో సూర్య..ఆనందంలో వధూవరులు..!