బుధవారం 25 నవంబర్ 2020
Medak - Oct 31, 2020 , 00:16:16

5లోపు వేదికలు పూర్తి చేయాలి

5లోపు  వేదికలు పూర్తి చేయాలి

కలెక్టర్‌ హన్మంతరావు

హవేళిఘనపూర్‌: నవంబర్‌ 5వ తేదీ లోపు రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ హన్మంతరావు అన్నారు. మండల కేంద్రమైన హవేళిఘనపూర్‌తో మండల పరిధిలోని కూచన్‌పల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న  రైతు వేదికల నిర్మాణ పనులను ఆయన పరిశీలించి పనులు ఏ దశలో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేయకుండా నవంబర్‌ 5లోపు పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట  తహసీల్దార్‌ వెంకటేశం, ఎంపీడీవో సాయిబాబా, ఏవో నాగమాధురి, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు సాల్మన్‌, సర్పంచ్‌ సవితశ్రీకాంత్‌, స్కూల్‌ తండా సర్పంచ్‌ యశోద, పంచాయతీ సెక్రటరీలు యాదగిరి ఉన్నారు. 

రైతు వేదికలు త్వరగా  పూర్తి చేయాలి

జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్‌

అల్లాదుర్గం: రైతు వేదికల నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని  బీసీ సంక్షేమశాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి జగదీశ్‌ అన్నారు. మండల పరిధిలోని గడిపెద్దాపూర్‌, చేవెళ్ల, ముస్లాపూర్‌, అల్లాదుర్గంలో నిర్మిస్తున్న రైతువేదిక పనులు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. మండలంలో చేపడుతున్న రైతువేదిక నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాలు తుది దశలో ఉన్నవాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతు వేదిక పనులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలన్నారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు ప్రతి రోజు కొనుగోలు కేంద్రాల్లో పర్యవేక్షణ చేస్తూ రైతుకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చూడాలన్నారు.కార్యక్రమంలో ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, తహసీల్దార్‌ సాయాగౌడ్‌, మండల వ్వవసాయ అధికారిణి నాగమణి , ఏపీవో పుణ్యదాస్‌, ఏపీఎం అశోక్‌, ఎంపీవో సయ్యద్‌ పాల్గొన్నారు.