మంగళవారం 01 డిసెంబర్ 2020
Medak - Oct 31, 2020 , 00:17:18

చేగుంటలో కార్డన్‌ సెర్చ్‌

చేగుంటలో కార్డన్‌ సెర్చ్‌

చేగుంట : మండల కేంద్రంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం చేగుంటలోని శ్రీనివాస్‌నగర్‌ కాలనీలోని ఇండ్లలో పోలీసులు తనిఖీలు చేశారని డీఎస్పీ వివరించారు. కాలనీలో వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పత్రాలు లేని వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో రామాయంపేట సీఐ నాగార్జున్‌గౌడ్‌, చేగుంట, నార్సింగి ఎస్సైలు  ఉన్నారు.