శనివారం 16 జనవరి 2021
Medak - Oct 29, 2020 , 23:04:25

కాంగ్రెస్‌, బీజేపీ పాలనలో క‘న్నీటి’ కష్టాలే

కాంగ్రెస్‌, బీజేపీ పాలనలో క‘న్నీటి’ కష్టాలే

చేగుంట: దేశాన్ని, రాష్ర్టాన్ని 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌, బీజేపీ కనీసం తాగడానికి గుక్కెడు నీరు ఇవ్వలేకపోయాయని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. చేగుంట మండలం రెడ్డిపల్లిలో గురువారం రాత్రి మెదక్‌ ఎంపీ కొత్త ప్రబాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలు మగళహారుతులతో,డప్పు చప్పులతో,బతుకమ్మలు, బోనాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అన్నారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు.మిషన్‌ భగీరథతో తాగునీటి కష్టాలు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగునీటి కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారన్నారు.  నవంబర్‌ 3న జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలను కోరారు. ప్రచారంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నరేంద్రనాథ్‌, కోమటిరెడ్డి వెంకట నర్సింహారెడ్డి, చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తాడెం వెంగళ్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రజనక్‌ ప్రవీణ్‌కుమార్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్‌ ,శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, జిల్లా నాయకులు గొర్రె వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ కాశగోని లక్ష్మీజ్ఞానేశ్వర్‌గౌడ్‌ ,ఉప సర్పంచ్‌ బోయిని నాగులు, సొసైటీ వైస్‌ చైర్మన్‌ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.