అబద్ధాలు చెప్తరు.. ఆపదకు రారు..

- ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
- తొగుట మండలం ఘనపూర్, గుడికందుల గ్రామాల్లో రోడ్‌షో
- అడుగడుగునా ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు
తొగుట : ‘బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చి బాగా మాట్లాడుతున్నారు.. నోటికి ఏది వస్తే అది చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.. అబద్ధాలు చెబుతున్నారు.. ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నాయకులు కనిపించకుండా పోతా రు.. మన ఆపదకు రారు.. ఎన్నికల తర్వాత ఎలాంటి ఆపద వచ్చినా.. అర్ధ గంటలో ఆటోలో నా ఇంటికి రావచ్చు.. మీ కోసం నా తలపులు 24 గంటలు తెరిచే ఉంటాయి’.. అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం తొగుట మండలం ఘనపూర్, గుడికందుల గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘తెలంగాణ రాక ముందు ఎంత గోస పడ్డామో మనకు తెలియదా.. గీ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రైతుల ఉసురు పోసుకున్నయి.. అర్ధరాత్రి 6గంటల కరెంటుతో ఎంతో మంది రైతులు షాక్‌తో చనిపోయారు. డిమ్ము కరెంటుతో మోటర్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం.. పంటలు ఎండిపోవడం.. ఇదే కథ ఉండే.. పంటలు ఎండిపోయాక, పెట్టుబడులు మీద పడ్డాక రైతులు అప్పులు తీర్చలేక ఆగమై ఆత్మహత్యలు చేసుకున్నారు.. వారి కుటుంబాలు ఆగమైపోయాయి.. మన కేసీఆర్ ద్వారా రాదనుకున్న తెలంగాణ తెచ్చుకోవడంతో పాటు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు ఎవుసం చేసేందుకు ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి, రైతు మరణిస్తే వారంలో రూ.5లక్షల బీమా, ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతుకు ఆపన్నహస్తం అందించారు’.. అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో మోటర్లు కాలిపోయాయని, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయని, నేడు బీజేపీ పాలనలో మోటర్లకు మీటర్లు పెట్టే కష్టం వచ్చిందన్నారు.
దమ్ముంటే మాలాంటి పథకాలు అమలు చేయండి..
బీజేపీ, కాంగ్రెస్‌కు దమ్ముంటే మన దగ్గర అమలు చేస్తున్నపథకాలు వారి దగ్గర అమలు చేయాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చి బాగా మాట్లాడుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మా సంక్షేమ పథకాలలో వాటా ఉందన్నారు కదా.. చర్చకు రావాలని సవాల్ విసిరితే సమాధానం చెప్పలేక సల్లపడ్డారన్నారు. ఝూటా, దగాకోరు, అబద్ధాల కోరు బీజేపీ మాటలు నమ్మవద్దన్నారు. మీ బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మా కన్నా గొప్ప పరిపాలన అందిస్తే మా దగ్గర అమలు చేస్తున్న 24గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు లాంటి పథకాలు గుజరాత్, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, పాండిచ్చేరి తదితర రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల్లో సీసాలు, డబ్బులు ఇస్తే మనకు కడుపు నిండుతుందా.. కాళేశ్వరం నీళ్లు వస్తే కడుపు నిండుతాయి కదా.. అని అన్నారు.
అద్దగంటలో హరీశన్న ఇల్లు వస్తుంది
‘ఎన్నికల్లోనే కాదు.. ఎన్నికల తర్వాత ఎలాంటి ఆపద వచ్చి నా.. అద్ద గంటలో ఆటోలో నా ఇంటికి రావచు.. మీ కోసం నా తలపులు 24 గంటలు తెరిచే ఉంటాయి’.. అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పక్కనే ఉన్న బుస్సాపూర్, వెంకటాపూర్ గ్రామాల్లా తొగుట మండలాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. హుజూర్నగర్లా దుబ్బాకకు కూడా ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకొని, అభివృద్ధి చేద్దామన్నారు. సుజాతమ్మకు సోదరుడిలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సిద్దిపేట తరహా కాల్వల్లో భూముల కోల్పోయిన వారికి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. నాణ్యమైన కరెంటు రావడంతో మోటర్లు కాలిపోవడం తగ్గిపోయాయని, కాళేశ్వరం నీళ్లు వస్తే బోరుబండ్లు మూలన పడుతాయన్నారు. బీజేపీకి ఓట్లు వేస్తే మన కంట్లో మనం పొడుచుకున్న వారవుతామన్నారు. శ్రీకాకుళంలో ఇప్పటికే మోటర్లకు మీటర్లు బిగిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ఓట్ల మీద మీకు దృష్టి ఉండాలని, మీకు సేవ చేసే దృష్టి నాకు ఉంటుందన్నారు. గతంలో ట్రక్కు గుర్తుకు 12వేల ఓట్లు పొరపాటున పోయాయని, నేడు అలాంటి పొరపాటు జరుగకుండా 3న జరిగే ఎన్నికల్లో 3వ నెంబర్ మీటా నొక్కాలని సూచించారు. మొత్తం ఎన్నికల అభ్యుర్థుల్లో ఏకైక మహిళ అభ్యర్థి సోలిపేట సుజాతమ్మను గుర్తించుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. మంత్రి హరీశ్‌రావుకు గ్రామ గ్రామాన ఆడపడుచులు మంగళహారతులు, బోనాలు, డప్పు చప్పుల్లతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ, రైతుబంధు సమితి చైర్మన్లు గడీల అనితాలక్ష్మారెడ్డి, కనకయ్య, పార్టీ మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి, సర్పంచులు గోవర్ధన్, కుంభాల వెంకటమ్మ, ఎల్లం, మలయ్య, ఎంపీటీసీలు శరత్, వెల్పుల స్వామి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అక్కా వెళ్లిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త
- ఈ రాశుల వారికి.. వ్యయ, ప్రయాసలు అధికం!
- 28 ప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు
- టీకా ఇచ్చి అభయం కల్పించి..
- నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!