శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medak - Oct 29, 2020 , 00:08:41

విద్యార్థులకు పోలీసు శిక్షణ - డీఐఈవో సూర్యప్రకాశ్‌

విద్యార్థులకు పోలీసు శిక్షణ - డీఐఈవో సూర్యప్రకాశ్‌

మెదక్‌ కలెక్టరేట్‌ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థినీ, విద్యార్థులను ప్రోత్సహించి వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి సూర్యప్రకాశ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు, గతంలో చదివిన వారికి ఉచితంగా పోలీసు శిక్షణ ఉంటుందన్నారు. విద్యార్థులు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, ఎస్‌ఎస్‌సీ మెమో, ఇంటర్‌ మెమో, బోనాఫైడ్‌, కులం సర్టిఫికెట్‌ జిరాక్స్‌ కాపీలను ఈ నెల 31వ తేదీలోపు కళాశాలలో సమర్పించాలన్నారు. అదే రోజు ఉదయం 10 గంటల నుంచి శారీరక ప్రమాణాలు(ఫిజికల్‌ టెస్ట్‌) నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే 9912370740, 9949257966, 7794030519 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.