శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medak - Oct 29, 2020 , 00:08:38

అనారోగ్యంతో పెద్దశంకరంపేట ఎంపీటీసీ మృతి

అనారోగ్యంతో పెద్దశంకరంపేట ఎంపీటీసీ మృతి

పెద్దశంకరంపేట : మండల కేంద్రం పెద్దశంకరంపేట పట్టణంలోని ఎంపీటీసీ-1 ఆర్‌ఎన్‌ రాజ్యమణి లక్ష్మీనారాయణ బుధవారం సాయంత్రం మృతి చెందారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె భర్త మాజీ సర్పంచ్‌ ఆర్‌ఎన్‌ లక్ష్మీ నారాయణ 40 రోజుల కింద మృతి చెందారు. కొన్ని రోజుల్లోనే ఇరువురు మృతి చెందడం పలువురిని కలిచి వేసింది. పెద్దశంకరంపేట పట్టణంలోని ఒకటో ఎంపీటీసీ మృతి చెందడంపై పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.