శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medak - Oct 28, 2020 , 00:05:28

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదు

 దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదు

 మెదక్‌ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఆరెళ్ల మల్లికార్జున్‌గౌడ్‌

రామాయంపేట : దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి తిరుగు లేని మెజార్టీ ఖాయమని మెదక్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెళ్ల మల్లిఖార్జున్‌ గౌడ్‌ అన్నారు. మంగళవారం రామాయంపేటలోని ఓ ఫాం హౌజ్‌లో నార్సింగి మండలానికి సంబంధించిన ఎన్నికల సామగ్రిని రామాయంపేట టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకులకు అందజేసి మాట్లాడారు.  ఓటమి భయంతో బీజేపీ నాయకులు మతిలేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.  ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కర్రె రమేశ్‌, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకులు ఇప్ప రవితేజ, అనిల్‌గౌడ్‌, మహేశ్‌, ప్రభాకర్‌, ప్రవీణ్‌గౌడ్‌, కిరణ్‌ ఉన్నారు.