శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medak - Oct 28, 2020 , 00:05:28

కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

తూప్రాన్‌ ఎంపీడీవో అరుంధతి 

తూప్రాన్‌ రూరల్‌ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే  రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించాలని తూప్రాన్‌ ఎంపీడీవో అరుంధతి అన్నారు. మండలంలోని మల్కాపూర్‌, ఘనపూర్‌, ఇస్లాంపూర్‌ గ్రామాల్లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఐకేపీ ఏపీఎం రామకృష్ణతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా రైతులకు సరైన గిట్టుబాటు ధరను కల్పించడం కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. పంచాయతీ కార్యర్శులు మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, రాజేశ్‌తో పాటు ఐకేపీ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.