బుధవారం 25 నవంబర్ 2020
Medak - Oct 27, 2020 , 00:04:07

వనదుర్గా మాతకు ప్రత్యేక పూజలు

వనదుర్గా మాతకు ప్రత్యేక పూజలు

పాపన్నపేట : మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా నియమితులయిన హన్మంతరావు సోమవారం ఏడుపాయల వనదుర్గా భవానీ మాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ ఈవో సార శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పూజారులు రాజగోపురం నుంచి అమ్మవారి ఆలయం వరకు వేద మంత్రోచ్ఛరణ చేస్తూ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హన్మంతరావు పేరున  పూజారులు అర్చనలు చేశారు. కలెక్టర్‌ హన్మంతరావు మాట్లాడుతూ మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చానన్నారు. సర్వేజనా సుఖినోభవంతు అన్నట్లు అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఏడుపాయలలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ఆలయ ఈవో సార శ్రీనివాస్‌ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ ఈవో కలెక్టర్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.