బుధవారం 25 నవంబర్ 2020
Medak - Oct 27, 2020 , 00:04:05

కుక్కల దాడిలో 13 గొర్రెలు మృతి

కుక్కల దాడిలో 13 గొర్రెలు మృతి

చిన్నశంకరంపేట : కుక్కలదాడిలో 13 గొర్రెలు మృతి చెందగా రూ.లక్షా50వేల  ఆస్తి నష్టం జరిగిన సంఘటన మండలంలోని భాగీర్తిపల్లి గ్రామంలో ఆదివారం  జరిగింది. బాధితుడు తడ్కపల్లి వీరయ్య వివరాల ప్రకారం.. గొర్రెలను పాకలోకి తోలి నిద్రకు ఉపక్రమించాడు. ఆదివారం తెల్లవారుజామున కుక్కలు పాకలోకి చొరబడి దాడి చేయగా, 13 గొర్రెలు మృతి చెందాయి. రూ.లక్షా50 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సర్పంచ్‌ దయానంద్‌యాదవ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ సత్యనారాయణ బాధితుడిని పరామర్శించారు.