నాని, సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ నాయకనాయికలుగా నటిస్తున్న చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. ఆదివారం సాయిపల్లవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. బెంగాలీ సంప్రదాయ పట్టువస్ర్తాల్లో త్రిశూలం ధరించి ప్రసన్నవదనంతో కనిపిస్తోంది సాయిపల్లవి. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘కలకత్తా నేపథ్యంలో జరిగే కథాంశమిది. సాయిపల్లవి పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుంది. హైదరాబాద్‌లో పదిఎకరాల్లో వేసిన సెట్లో ఇటీవలే కీలక షెడ్యూల్‌ను పూర్తిచేశాం. వినూత్న కథాంశంతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే చిత్రమిది’ అన్నారు. జిషూసేన్గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీశర్మ, అభినవ్గోమటం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సనుజాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జే మేయర్, ఒరిజినల్ స్టోరీ: సత్యదేవ్ జంగా, నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్స్, దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్.