మంగళవారం 01 డిసెంబర్ 2020
Medak - Oct 24, 2020 , 00:22:18

కాళరాత్రి దేవీగా మహంకాళి అమ్మవారు

  కాళరాత్రి దేవీగా మహంకాళి అమ్మవారు

 రామాయంపేట :   పట్టణంలోని మహంకాళి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని కాళరాత్రి దేవీగా అలంకరించారు. భక్తులు అమ్మవారికి పూజలు చేశారు. పట్టణంతో పాటు అక్కన్నపేట, కోనాపూర్‌, కాట్రియాల, తొనిగండ్ల, పర్వతాపూర్‌ గ్రామాల్లో దుర్గామాత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో దర్శనమిచ్చారు.  ఝాన్సీలింగాపూర్‌ గ్రామంలోని రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ బానప్పగారి నర్సారెడ్డి దంపతులు హోమంలో పాల్గొని కుంకుమ పూజలు చేశారు.  రాఘవేంద్ర యూత్‌ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.  

 మనోహరాబాద్‌లో..

మనోహరాబాద్‌ :  శివ్వంపేట మండలం అల్లీపూర్‌లో దుర్గాభవానీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వాల్దాస్‌ రాధామల్లేశ్‌గౌడ్‌ అమ్మవారిని దర్శించుకున్నారు.  

 శ్రీమహాలక్ష్మీదేవీగా దుర్గామాత 

నిజాంపేట : నిజాంపేటతో పాటు కల్వకుంట, నందిగామ, నందగోకుల్‌, నస్కల్‌ తదితర గ్రామాల్లో  దుర్గామాత శరన్నవరాత్రులు  కొనసాగుతున్నాయి.  నిజాంపేటలో దుర్గామాతను  ఎంపీటీసీ దంపతులు లహరి కిష్టారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడో రోజు దుర్గామాత శ్రీమహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. నందిగామలో దుర్గామాతకు బోనాలు సమర్పించారు.