శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medak - Oct 23, 2020 , 01:14:28

పోయిరా బతుకమ్మ.. మళ్లి రావమ్మ

పోయిరా బతుకమ్మ.. మళ్లి రావమ్మ

నర్సాపూర్‌ రూరల్‌:  నర్సాపూర్‌ మున్సిపాలిటీలో గురువారం   బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని శివాలయం, చిల్డ్రన్స్‌ పార్కు వద్ద బతుకమ్మ సంబురాలకు   మున్సిపాలిటీ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఆడపడుచులు కొత్త దుస్తులను ధరించి బతుకమ్మలను అందంగా అలంకరించి ఆటపాటలతో సంతోషంగా బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. 

  మండల పరిధిలోని పెద్దచింతకుంట గ్రామంలో  బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు కొత్త బట్టలు ధరించి, బతుకమ్మను అందంగా అలంకరించి ఒకచోటకు చేరి ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శివకుమార్‌, వార్డు మెంబర్లు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.  

 ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కౌన్సిలర్‌

 బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లను 2వ వార్డు కౌన్సిలర్‌ లతారమేశ్‌ యాదవ్‌   పరిశీలించారు. రాయారావు చెరువులో మహిళలు ఇబ్బందులు పడకూడదని  నేలను చదును చేయించారు.   

అంతారం, చండూర్‌ ,జగ్గంపేట  గ్రామాల్లో

చిలిపిచెడ్‌: మండలంలోని  గ్రామాల్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి.   మండల పరిధిలోని అంతారం, చండూర్‌ , జగ్గంపేట  గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  మహిళలందరూ కలిసి బతుకమ్మ ఆటపాటలతో ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆట ఆడిన తర్వాత బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అంతకుముందు మహిళలు రంగురంగుల పువ్వులను  సేకరించి బతుకమ్మలు ఆడి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కొల్చారం మండలంలో...

కొల్చారం: కొల్చారం మండల వ్యాప్తంగా అట్ల బతుకమ్మ సంబురాలు   భక్తిశ్రద్ధలతో జరిగాయి. వారం రోజుల క్రితం ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ మహిళలు బతుకమ్మ ఆటలాడారు.  అట్ల బతుకమ్మతో బతుకమ్మ సంబురాలు ముగియగా, శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి.  

తాజావార్తలు