బుధవారం 25 నవంబర్ 2020
Medak - Oct 22, 2020 , 00:36:59

రైతు వేదిక నిర్మాణాలను త్వరలో పూర్తి చేస్తాం

 రైతు వేదిక నిర్మాణాలను త్వరలో పూర్తి చేస్తాం

జడ్పీ సీఈవో లక్ష్మీబాయి

నర్సాపూర్‌ రూరల్‌ : మండల వ్యాప్తంగా 5 గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాల నిర్మాణ పనులను త్వర లో పూర్తి చేసి, అందుబాటులోకి తెస్తామని జడ్పీ సీఈవో లక్ష్మీబాయి పేర్కొన్నారు. నర్సాపూర్‌ పట్టణంలో నిర్మిస్తు న్న రైతు వేదికను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో లక్ష్మీబాయి మాట్లాడుతూ.. నర్సాపూర్‌లో రైతు వేదిక నిర్మాణ పనులు చివరి దశకు వచ్చిందని, రెండు రోజుల్లో పనులు పూర్తవుతాయని తెలిపారు. వర్షాల కారణంగా మిగతా చోట్ల పనులు నెమ్మదిగా సాగుతున్నాయని, వాటిని  కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. జడ్పీ సీఈవో వెంట ఎంపీడీవో మార్టిన్‌ లూథర్‌, పంచాయతీరాజ్‌ డీఈ రాధికాలక్ష్మి, పీఆర్‌ఏఈ స్వామిదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

  అపరిశుభ్రతపై ఆగ్రహం

 ఎంఈవో కార్యాలయం ఆవరణంలో నెలకొన్న అపరిశుభ్రతపై జడ్పీ సీఈవో లక్ష్మీబాయి కార్యాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వేదిక నిర్మాణాన్ని పరిశీలించడానికి వచ్చిన జడ్పీ సీఈవో బుధవారం ఎంఈ వో కార్యాలయానికి వచ్చారు. కార్యాలయ ఆవరణంలో పేరుకుపోయిన అపరిశుభ్రతపై సిబ్బందిని పిలిపించి నిల దీశారు. వెంటనే పరిసరాల్లోని చెత్తను తొలిగించి, ఆవరణాన్ని ప్రతి రోజూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల ఆవరణాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా కార్యాలయ సిబ్బంది జాగ్రత్త వహించాలని తెలిపారు. జడ్పీ సీఈవోతో పాటు ఎంపీడీవో మార్ట్టిన్‌ లూథర్‌, అధికారులు ఉన్నారు.