బుధవారం 25 నవంబర్ 2020
Medak - Oct 22, 2020 , 00:36:57

ఆహ్లాదం.. ఆనందం

ఆహ్లాదం.. ఆనందం

చిలిపిచెడ్‌ మండలంలో పచ్చని పందిళ్లుగా మారిన రహదారులు

సేదతీరేందుకు నీడనిస్తున్న చెట్లు 

చిలిపిచెడ్‌ : ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఎన్నో ఫలితాలను ఇస్తుంది. నాలుగు విడుతల్లో నాటిన హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి. వేసవిలో వాహనాలపై ప్రయాణించే సమయంలో ఎక్కడైనా రోడ్డు పక్కన కాస్త నీడన సేద తీరుదామంటే నిలువ నీడలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. నేడు రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలతో పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం, వాహనదారులు సేదతీరేందుకు చల్లని నీడను ఇస్తున్నాయి. దీంతో ప్రజలు పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

చిలిపిచెడ్‌ మండలంలో గ్రామాలు, పట్టణాలకు వెళ్లే రహదారుల పక్కన నాలుగు విడుతల్లో హరితహారం మొ క్కలు నాటారు. మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు అవసరమైన సంరక్షణ చర్యలు తీసుకున్నారు. నిత్యం నీళ్లు పోసి, సంరక్షించడంతో ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నాయి. చిట్కుల్‌ నుంచి మెదక్‌ వెళ్లే దారిలో భద్రీయా తండా, చండూర్‌ నుంచి నర్సాపూర్‌ వెళ్లే దారిలో గంగారం వరకు నాటిన మొక్కలు ఏపుగా పెరిగి, పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. చండూర్‌ చౌరస్తా నుంచి అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు పెంచుతున్నారు. ప్రతి మొక్కకు నీరు పోసి మొక్కలను ప్రాణంగా పెంచుతున్నారు.

మొక్కలను ప్రాణంగా సంరక్షించాం.. 

రోడ్డు పక్కన నాటిన మొక్కలను సం రక్షించడంతో నేడు పచ్చదనాన్ని పంచు తున్నాయి. మొక్కలను ప్రాణంగా సంర క్షించడంతో ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. చిట్కుల్‌ గ్రామం నుంచి వెళ్లే ప్రతి రహదారి వెంట భారీసంఖ్యలో మొ క్కలను పెంచి, సంరక్షించాం.  వాహనాలపై ప్రయాణం చేసేవారు చెట్లు నీడన సేద తీరుతున్నారు.  

               - గోపాల్‌రెడ్డి (చిట్కుల్‌ గ్రామ సర్పంచ్‌)  

పచ్చదనంతో ఆహ్లాదం 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన  హరితహారంలో నాటిన మొక్కలు నేడు ప చ్చదనాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ దారిన వెళ్లే ప్రయాణికులకు పచ్చదనం తోపాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.  మొక్కల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి.     

              -  కుణ్యనాయక్‌ (భద్రీయతండా గ్రామస్తుడు)