శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medak - Oct 21, 2020 , 00:31:33

దేవీమాతకు విశేష పూజలు

దేవీమాతకు విశేష పూజలు

మెదక్‌ టౌన్‌  : పట్టణంలోని  కుమ్మరిగడ్డ కాలనీలో దుర్గామాత మంగళవారం అన్నపూర్ణగా,  బోరంచమ్మ ఆలయంలోని సరస్వతీ మాత లక్ష్మిదేవీగా అమ్మవారు  దర్శనమిచ్చారు. పూజారులు అమ్మవారికి అభిషేకలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

  మహాలక్ష్మిగా సరస్వతీ మాత

మెదక్‌ రూరల్‌ : మండలంలోని పేరూర్‌ సరస్వతీ మాత దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు సరస్వతీ మాత అమ్మవారు మహాలక్ష్మీ దేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకుడు రాజమౌళీశర్మ ఆధ్వర్యంలో భక్తులు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. 

  అమ్మవారికి కుంకుమార్చన

పెద్దశంకరంపేట : పట్టణంలోని తిర్మలాపురంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రతిష్ఠించిన దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమార్చన చేశారు.  

చిన్నశంకరంపేట : మండలంలోని వివిధ గ్రామా ల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, ఇతర ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారి మండపాల వద్దకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు అమ్మవారి ఒడి బియ్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 

కూష్మాండ దేవీగా అమ్మవారు

రామాయంపేట : పట్టణంలోని మహంకాళీ ఆలయంలో అమ్మవారు కూష్మాండ దేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్‌ పాండురంగాచారి, వరలక్ష్మి దంపతులు అమ్మవారికి మంగళ హారతులు, అభిషేకాలు నిర్వహించారు.   కార్యక్రమంలో పూజారి గంగాధర చారి, ఆలయ సిబ్బంది శ్యాంరాజు, సత్యం, యాదగిరి, నరేశ్‌ ఉన్నారు.

 కొనసాగుతున్న మహోత్సవాలు

నిజాంపేట : మండలవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. నిజాంపేటలోని హనుమాన్‌ ఆలయంలో దుర్గామాతకు ప్రత్యేక పూజ లు, అభిషేకాలు నిర్వహించారు. మంగళవారం దుర్గామాత భక్తులకు అన్నపూర్ణదేవీగా దర్శనమిచ్చారు.