ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Oct 19, 2020 , 01:12:00

ఆన్‌లైన్‌ వ్యాస రచన పోటీలో పాల్గొనాలి

ఆన్‌లైన్‌ వ్యాస రచన పోటీలో పాల్గొనాలి

మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ జోయల్‌ డెవిస్‌

మెదక్‌ కలెక్టరేట్‌: పోలీసు అమరవీరుల సం స్మరణ దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌లో వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నట్లు మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ జోయల్‌ డెవిస్‌ అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులను స్మరించుకుంటూ అక్టోబర్‌ 21వ తేదీన పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా పరిధిలోని ఆసక్తి గల  విద్యార్థులు పోలీసు నిర్వహించే ఆన్‌లైన్‌లో వ్యాస రచన పోటీలో పాల్గొనాలని తెలిపారు. వ్యాస రచన పోటీ కరోనా సమయంలో తెలంగాణ పోలీసుల పనితీరు అనే అంశంపై ఉంటుందని చెప్పారు.  వ్యాస రచన పోటీ పరీక్ష 3 విభాగాల్లో నిర్వహిస్తామన్నారు. మొదటి విభాగం 8వ తరగతి నుంచి 10వ తరగతి, రెండో విభాగం ఇంటర్మీడియట్‌ వరకు, మూడో విభాగం డిగ్రీ లెవల్‌ విద్యార్థులకు ఉంటుందని తెలిపారు. వ్యాసాన్ని అక్టోబర్‌ 21 లోపు పంపాలని తెలిపారు. వ్యాస రచన ఎంపిక చేసిన ఉత్తమ మూడు వ్యాసాలకు జిల్లా పోలీసు శాఖ వారు బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. వ్యాసాలను జిల్లా అధికారిక సోషల్‌ మీడియా పేజీల్లో పోస్టు బహుమతులు గెలుపొందిన వ్యాసాల నుంచి ఉత్తమ మూడు వ్యాసాలను ఎంపిక చేస్తామన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి ఉత్తమ వ్యాసాలుగా తెలంగాణ పోలీసు అధికారిక సోషల్‌ మీడియా పేజీల్లో పోస్టు చేయనున్నట్లు పేర్కొన్నారు.  logo