మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Oct 19, 2020 , 00:50:24

దేవీ నమోస్తుతే

దేవీ నమోస్తుతే

మెదక్‌ టౌన్‌  :మాత బోరంచమ్మ దేవీ శరన్నరాత్రులను పురస్కరించుకొని పట్టణంలోని  మాతా బోరంచమ్మ  దేవాలయంలోని సరస్వతీ మాత శ్రీబాలాత్రిపుర సుందరి దేవీగా దర్శనమిచ్చింది.అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు    పాల్గొన్నారు.

గాయత్రి దేవీగా భక్తులకు దర్శనం

మెదక్‌ రూరల్‌: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని పేరూర్‌ సరస్వతీ మాత దేవాలయంలోసరస్వతీమాత   రెండో  రోజు గాయత్రి దేవీగా భక్తులకు దర్శనమిచ్చారు.   కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక పూజలు  నిర్వహించారు.

నిజాంపేటలో..

నిజాంపేట: వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి గ్రామాల్లో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  రెండోరోజు  అమ్మవారు బాలాత్రిపురసుందరిదేవీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.భక్తులు, కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు.

అమ్మవారికి కుంకుమార్చనలు..

తూప్రాన్‌ రూరల్‌ : పట్టణంలో  ఆదివారం దుర్గామాత నవరాత్రోత్సవాలు కన్నుల పండువగా కొనసాగాయి.గోల్డెన్‌ పార్క్‌ ఆవరణల్లో ఏర్పాటు చేసిన దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నిబంధనలు పా టిస్తూ అమ్మవారికి కుంకుమార్చనలు  నిర్వహించా రు.ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

గ్రామాల్లో అమ్మవారికి  ప్రత్యేక పూజలు.. 

పెద్దశంకరంపేట: మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం అమ్మవారు గాయత్రీదేవీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. గ్రామాల్లో అమ్మవారికి భక్తులు  పూజలు నిర్వహించారు. 

బాలాతిపుర సుందరిదేవీ అవతారంలో..

చిన్నశంకరంపేట: మండలంలోని అంబాజిపేట, గవ్వలపల్లి,కొర్విపల్లి తదితర గ్రామాల్లో ఆదివారం దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారు భక్తులకు శ్రీబాలాత్రిపుర సుందరిదేవీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి మండపాల వద్దకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను తీర్చుకున్నారు.

అన్నపూర్ణదేవీగా..

వెల్దుర్తి: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు ఆదివారం దుర్గాదేవీ అన్నపూర్ణదేవీగా భక్తులకు దర్శనమించిది. మండల కేంద్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో దుర్గాభవానీ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవీ అన్నపూర్ణగా అలంకరించారు. భక్తులు అమ్మవారికి పంచామృతాభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించారు. logo