శుక్రవారం 30 అక్టోబర్ 2020
Medak - Oct 18, 2020 , 01:08:40

ఎంపీడీవోకు ఘన నివాళి

ఎంపీడీవోకు ఘన నివాళి

వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేసి సంతాపం

చిన్నశంకరంపేట :  ఎంపీడీవో లక్ష్మణమూర్తి మృతికి చిన్నశంకరంపేటలో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేసి సంతాపం ప్రకటించారు. ఎంపీపీ భాగ్యలక్ష్మి, సర్పంచ్‌ రాజిరెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో లక్ష్మణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ, సర్పంచ్‌ మాట్లాడుతూ లక్ష్మణమూర్తి  సేవలు మరువలేనివని కొనియాడారు.  కార్యక్రమంలో  పంచాయతీ కార్యదర్శులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.