బుధవారం 21 అక్టోబర్ 2020
Medak - Oct 17, 2020 , 02:21:37

వరి కోత యంత్రాలకు ఫ్యాన్స్‌, బెల్ట్‌ లేకపోతే సీజ్‌ చేస్తాం

వరి కోత యంత్రాలకు   ఫ్యాన్స్‌, బెల్ట్‌ లేకపోతే సీజ్‌ చేస్తాం


వరి కోత యంత్రాలకు

 ఫ్యాన్స్‌, బెల్ట్‌ లేకపోతే సీజ్‌ చేస్తాం 

  ఆర్డీవో శ్యాంప్రకాశ్‌  l వరికోతల యంత్రాల యజమానులకు అవగాహన

చేగుంట: వరి కోత య్రంతాలకు తప్పని సరిగా ఫ్యాన్లు, బెల్టులు సరైన పద్ధతిలో ఉండే విధంగా చూసుకోవాలని తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, రామయంపేట డివిజన్‌ వ్యవసాయశాఖ సహాయసంచాలకురాలు వసంతసుగుణ అన్నారు. బెల్టులు సరిగా లేని  వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.  మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయాల ఆవరణలో చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన వరి కోత యంత్రాల యజమానులతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. యంత్రాలు కోత కోసే సమయాల్లో తాలు వచ్చినట్లయితే వ్యవసాయశాఖ, రెవెన్యూ అధికారులకు సమాచారమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డీవో స్థాయిలో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. వివరాలకు 934699920 నంబర్‌లో సంప్రదించొచ్చని సూచించారు. 

 వరికోతలపై అవగాహన

 వెల్దుర్తి : వరి పంట కోసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కౌడిపల్లి డివిజన్‌ ఏడీఏ బాబునాయక్‌ సూచించారు. వరికోతల యంత్రాల యజమానులు, డ్రైవర్లకు  తహసీల్‌ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని  నిర్వహించారు.  సమావేశానికి ఏవో మాలతి, ఆర్‌ఐ ధన్‌సింగ్‌తో కలిసి  ఏడీఏ వరికోతలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలను వివరించారు.  విద్యుత్‌ తీగలు తగలకుండా, ఇతర ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మండలంలోని వరికోత యంత్రాల యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.  

పాపాన్నపేటలో..

పాపన్నపేట :  మండల పరిధిలోని లక్ష్మీనగర్‌ పంచాయతీ కార్యాలయంలో మెదక్‌ ఏడీఏ నగేశ్‌ ఆధ్వర్యంలో వరికోత మిషన్‌ యజమానుల  సమావేశాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ  మాట్లాడుతూ వరికోసే సమయంలో హార్వెస్టర్‌కు సంబంధించిన ఫ్యాన్‌బెల్ట్‌ తప్పనిసరిగా ఉంచాలని సూచించారు.  సమావేశంలో  మండల వ్యవసాయశాఖ అధికారి ప్రతాప్‌కుమార్‌, తహసీల్దార్‌ బలరాం, ఏపీఎం సాయిలు  పాల్గొన్నారు.logo