బుధవారం 21 అక్టోబర్ 2020
Medak - Oct 15, 2020 , 02:04:20

ఇంటింటి సర్వే పక్కాగా చేపట్టాలి

ఇంటింటి సర్వే పక్కాగా చేపట్టాలి

నిజాంపేట : ఇంటింటి సర్వేను పక్కగా నిర్వహించాలని ఇన్‌చార్జి డీపీవో శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం ఆయన నిజాంపేటలో నిర్వహించిన ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్తుల వివరాలు పక్కాగా ఇంటింటి సర్వే ఫార్మాట్‌లో నమోదు చేస్తూ ఇంటి యజమాని ఫొటో ఖచ్చితంగా ఉండాలని పంచాయతీ సెక్రటరీ సంధ్యారాణికి సూచించారు. ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియలో ప్రజలకు వచ్చే అనుమానాలను పంచాయతీ కార్యదర్శిలే నివృత్తి చేయాలన్నారు. ఆయన వెంట కారోబార్‌ కొండల్‌రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.

ధరణి యాప్‌లో నమోదుకు సహకరించండి..

రామాయంపేట : మండల వ్యాప్తంగా ప్రజలు ఈ పంచాయతీ, ధరణియాప్‌కు సహకరించాలని రామాయంపేట మున్సిపల్‌ కమిషనర్‌ శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం రామాయంపేట పట్టణంలోని వార్డుల్లో పర్యటించి ఇన్‌చార్జిలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పురపాలికలో మొత్ంత 5300 ఇండ్లు ఉన్నాయని వార్డులకు ఇన్‌చార్జిలుగా ఉన్నవారు ఇండ్ల సర్వేలను వేగంగా చేపట్టాలని అన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు 60శాతం మేర  ఇండ్ల సర్వేలను పూర్తి చేయడం జరిగిందన్నారు. మున్సిపల్‌ సిబ్బందికి పట్టణ వాసులు సహకరించి పూర్తి వివరాలను ఇవ్వాలన్నారు. ఆయన వెంట బిల్‌ కలెక్టర్‌ కాలేరు ప్రసాద్‌, నవాత్‌ ప్రసాద్‌, నరేశ్‌, శంకర్‌, పద్మ ఉన్నారు.logo