బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Oct 10, 2020 , 01:46:00

సర్కారు ఇచ్చిన సంతోషం

సర్కారు ఇచ్చిన సంతోషం

అక్కన్నపేట : మండల వ్యాప్తంగా బతుకమ్మ చీరెల పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభమైనట్లు ఎంపీడీవో కొప్పుల సత్యపాల్‌రెడ్డి తెలిపారు. మండలంలో మొత్తం 32 గ్రామ పంచాయతీలు ఉండగా ఉమ్మడి గ్రామపంచాయతీల ప్రాతిపాదికన 18 గ్రామ పంచాయతీలకు 12627 బతుకమ్మ చీరెలు వచ్చినట్లు చెప్పారు.  మండలంలోని ఆయా గ్రామపంచాయతీ కార్యాలయల వద్ద పంచాయతీ కార్యదర్శి, మహిళ సంఘం అధ్యక్షురాలు, సీఏ, రేషన్‌ డీలర్‌ కలిసి బతుకమ్మ చీరెలను పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తారన్నారు. ప్రతి ఆడపడుచు సద్దుల బతుకమ్మ కానుకగా ప్రభుత్వం చీరెలను అందజేస్తుందన్నారు. త్వరలో మ రో 2265 బతుకమ్మ చీరెలు రానున్నట్లు వెల్లడించారు 

 అంబార్‌పేటలో..

వర్గల్‌ : తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ సంబురాలను పురస్కరించుకొని ప్రభుత్వం అందజేస్తున్న చీరెల కానుక మండలానికి 11026 చీరెలు రాగా  శుక్రవారం  అంబార్‌పేటలో 390 మంది మహిళలకు మొదటి విడుతగా 280 చీరలను అందజేశారు. చీరెలను తీసుకున్న మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్‌ అంజయ్య, ఎంపీటీసీ నీల శ్రీనివాస్‌, వార్డు సభ్యులు కుమ్మరి భాస్కర్‌, మహిళా సమైఖ్య సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మర్కూక్‌ మండలానికి 7350 చీరెలు 

మర్కూక్‌ : మర్కూక్‌ మండలానికి సంబంధించిన 16 గ్రామపంచాయతీలకు బతుకమ్మ కానుకగా 7350 చీరెలు వచ్చినట్లు తహసీల్దార్‌ ఆరీఫా,ఎంపీడీవో ఓబులేశ్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని ఆయా గ్రామాల రేషన్‌ డీలర్లతో బతుకమ్మ చీరెల పంపిణీపై తీసుకోవల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో చేపట్టే చీరెల పంపిణీలోమహిళా సమైఖ్య సంఘాల సభ్యులు సేవలను వినియోగించుకోవాలన్నారు.  


logo