బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Oct 07, 2020 , 03:04:46

భారీ మెజార్టీయే సోలిపేటకు ఘన నివాళి

భారీ మెజార్టీయే సోలిపేటకు ఘన నివాళి

దుబ్బాక : ప్రజా ఉద్యమాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సేవలు ఎనలేనివని, ఆయ న సేవలను టీఆర్‌ఎస్‌ మరువదని, దుబ్బాక ఉప ఎన్నికల్లో రామలింగారెడ్డి సతీమణి సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. మంగళవారం దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో సోలిపేట రామలింగారెడ్డి స్వగృహానికి మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాక్‌రెడ్డి, మెదక్‌, అందోల్‌ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, క్రాంతికిరణ్‌లతో కలిసి మంత్రి హరీశ్‌రావు వెళ్లారు. ఈ సందర్భంగా రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామలింగారెడ్డి సతీమణి సుజాత వారిని చూసి కన్నీటి పర్యంతమయ్యా రు. ఆమెను మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ ఓదా ర్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో, టీఆర్‌ఎస్‌ పార్టీలో రామలింగారెడ్డి క్రి యాశీలకంగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. రామలింగారెడ్డి చేసిన సేవలను గుర్తుంచుకుని దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసేందుకు సుజాతకు సీఎం కేసీఆర్‌ అవకాశం ఇచ్చారని, పోటీకి సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఆమెను మంత్రి కోరారు. రామలింగన్న ఆశయ సాధనతో పాటు దుబ్బాక నియోజకవర్గంలో ప్రజా సేవలో ఉండాలన్నారు. తమ కుటుంబానికి అండగా నిలిచినందుకు  సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా సోలిపేట సుజాత కృతజ్ఞతలు తెలిపారు.  

భారీ మెజార్టీ రావాలి..

సీఎం కేసీఆర్‌ దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను ప్రకటించినందున, భారీ మెజార్టీతో గెలిపించుకుని రామలింగన్నకు ఘనమైన నివాళులర్పిద్దామని మంత్రి హరీశ్‌రావు కోరారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో నడిచారన్నారు. జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా, కార్యకర్తగా ఉంటూ...నిరంతరం దుబ్బాక ప్రజల కోసం పరితపించారని గుర్తుచేశారు. సుజాతను అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా పక్షాన ఉంటూ రామలింగారెడ్డి ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి..తెలంగాణ ఉద్యమంలో సీఎం  కేసీఆర్‌ అడుగుజాడల్లో నడిచి పోరాటాన్ని తీవ్రతరం చేశారంటూ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై శాసనసభలో గొంతెత్తి అప్పటి సమైక్య ప్రభుత్వాలను  నిలదీశారన్నారు. సోలిపేట సుజాత అక్కకు రాజకీయాలు కొత్త కావని, ముందు నుంచి ప్రజల మధ్యనే ఉన్నారని, ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారని తెలిపారు. ఇంటికి వచ్చే కార్యకర్తల యోగక్షేమాలను తెలుసుకోవటంతో పాటు సమస్యలతో వచ్చే ప్రజలను ఆమె ఆప్యాయంగా పలుకరించి, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారని తెలిపారు. నేను 2004లో ఎమ్మెల్యేగా పోటీచేసిన సమయంలో సుజాతక్క నాతరపున ప్రచారంలో పాల్గొన్నారంటూ మంత్రి గుర్తు చేశా రు.  

దేశంలో తెలంగాణ రోల్‌ మోడల్‌...

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఏ రంగంలో చూసినా నేడు తెలంగాణ అన్ని రాష్ర్టాల్లో కంటే ముందంజలో ఉంది. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పాలసీలు , సంక్షేమ కార్యక్రమాలు  దేశానికి రోల్‌ మోడల్‌గా నిలిచాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలో అన్ని రాష్ర్టాలు తెలంగాణ సంక్షేమ పథకాలు, పాలసీలను ప్రశంసిస్తున్నాయన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో రామలింగారెడ్డి  ఇంటింటికీ నల్లా నీరు అందించారని, ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు కాల్వల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. రామలింగారెడ్డి ఆశయాలను సుజాతక్క రూపంలో అతి త్వరలోనే ప్రతి ఎకరానికి సాగు నీరు అందించనున్నామని హరీశ్‌రావు తెలిపారు. నియోజకవర్గంలోని  పేదలకు సొం తింటి కలను సాకరం చేసేందుకు, రామలింగారెడ్డి అత్యధికంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయించుకున్నారని గుర్తుచేశారు.  బీడీ, చేనేత, గీత కార్మికులతో పాటు వృద్ధ్దాప్య, దివ్యాంగ పింఛన్లు మం జూరైనట్లు తెలిపారు. రామలింగారెడ్డి ఆలోచనలు, ఆశయ సాధనకు సీఎం కేసీఆర్‌ దుబ్బాక శాసనసభకు టీఆర్‌ఎస్‌ తరపున సోలిపేట సుజాత పోటీచేసేందుకు నిం డు ఆశీస్సులు అంది ంచారని, నియోజకవర్గ ప్రజలు నిండు మనస్సుతో ఆమె గెలిపించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. logo