శుక్రవారం 30 అక్టోబర్ 2020
Medak - Oct 06, 2020 , 01:11:58

ముమ్మరంగా సాగుతున్న సర్వే

ముమ్మరంగా సాగుతున్న సర్వే

పాపన్నపేట: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఇంటింటి సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. మండల పరిధిలోని 36 గ్రామపంచాయతీలు ఉండగా 13,805 గృహాలు సర్వే చేయాల్సింది. ఇందులో భాగంగా 50మంది సిబ్బంది వివిధ గ్రామాల్లో సర్వే ముమ్మరం చేశారు.  పాపన్నపేట ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో లక్ష్మీకాంతరెడ్డి. సోమవారం వివిధ గ్రామాల్లో తిరుగుతూ సర్వే పనులను పర్యవేక్షించారు. మిన్పూర్‌, కొంపల్లి, నర్సింగరావుపల్లి తండా, రామతీర్థం గ్రామాల్లో నెట్‌ సిగ్నల్స్‌ రాక  ఇబ్బందులు తలెత్తున్నట్లు గ్రామస్తులు ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లారు. ఇలా ఉండగా రికార్డులో ఇంటి యజమానిగా ఉన్నవారికి సంబంధించిన భూమి పట్టాదారు పాసుపుస్తకం, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, కరెంట్‌ బిల్లుతో పాటు కుటుంబసభ్యుల ఆధార్‌కార్డు జిరాక్స్‌ కాఫీలు ఉంటే ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తవుతుందని ఎంపీడీవో వెల్లడించారు. ఇంటి యజమానులు వీటిని తమ దగ్గర ఉంచుకొని సర్వేకు వచ్చిన  సిబ్బందికి సహకరించాల్సిందిగా ఆయన సూచించారు. అంతేకాకుండా ఇంటి యజమాని లైవ్‌ ఫొటో తీసుకోవాల్సి ఉంటుందని ఇంటి యజమాని కూడా సర్వే సమయంతో ఇంటి వద్ద ఉండాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

హవేళిఘనపూర్‌లో

హవేళిఘనపూర్‌: అధికారులు గ్రామాల్లోని ప్రజల ఇంటి వివరాల ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంపీడీవో సాయిబాబా అన్నారు.  మండల పరిధిలోని గాజిరెడ్డిపల్లి, బూర్గుపల్లి, వాడి, కొత్తపల్లి, రాజ్‌పేట గ్రామాల్లో జరుగుతున్న ఇంటింటి  సర్వేను ఆయన పర్యవేక్షించి సెక్రటరీలకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి సర్వేకు వచ్చిన అధికారులకు ప్రజలు సహకరించి పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గాజిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌ భాగ్యశ్రీనివాస్‌, పంచాయతీ సెక్రటరీ రమేశ్‌లు ఉన్నారు. 

పూర్తి వివరాలు  చెప్పాలి

టేక్మాల్‌: ప్రజలకు ఆస్తి హక్కులను కల్పించడానికి తెలంగాణ సర్కార్‌ ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నామని సర్పంచ్‌ సుప్రజా భాస్కర్‌ తెలిపారు. టేక్మాల్‌లో  ఇంటింటి సర్వే చేపట్టారు. వ్యవసాయ భూములకు హక్కులు కల్పించినట్లుగానే వ్యవసాయేతర ఆస్తులు, ఇండ్లకు సైతం హక్కులను కల్పించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజలంతా తమ ఇండ్లు, ఖాళీ స్థలాల వివరాలను తెలియజేయాలని ఆమె కోరారు. మండలంలోని ధనూర, కుసంగి, ఎల్లుపేట, చల్లపల్లి, పల్వంచ గ్రామా ల్లో వివరాల సేకరణ కోసం సర్వే నిర్వహించారు. ఈ సర్వేను ఎంపీడీవో హిరణ్మయి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచిస్తున్నారు. 

ప్రజలు అందుబాటులో ఉండాలి

చిన్నశంకరంపేట: మండలంలోని వివిధ గ్రామాల్లో ఇంటింటి సర్వే కొనసాగింది. మండలంలోని  సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి ఇంటి ఆస్తుల వివరాలతో పాటు వ్యవసాయేతర భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశా రు. ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ఎంపీడీవో లక్ష్మణమూర్తి, ఎంపీవో గిరిధర్‌రెడ్డిలు పర్యవేక్షించారు. 

ఈ సందర్భంగా ఎంపీడీవో లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ఇంటి ఆస్తుల వివరాలను వ్యవసాయేతర భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం  8వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ప్రజలు తమ ఇండ్ల వివరాలను తప్పకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

రామాయంపేట: పట్టణంతో పాటు మండలంలోని డి.ధర్మారం, కాట్రియాల, లక్ష్మాపూర్‌, తొనిగండ్ల, పర్వతాపూర్‌, అక్కన్నపేట గ్రామాల్లో సోమవారం ఇంటింటి సర్వేలు జోరుగా సాగుతున్నాయి. పట్టణంలో బిల్‌ కలెక్టర్‌ కాలేరు ప్రసాద్‌ ఆధ్వర్యంలో వార్డుల్లో తిరుగుతూ ఇంటి వివరాలను సర్వే సిబ్బంది సేకరిస్తున్నారు.ఇంట్లో ఉన్న జనాభాతో పాటు ఇంటి కొలుతలు, ఆధార్‌ నంబర్లు, కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేస్తున్నారు.గ్రామాల్లో కార్యదర్శులు వివరాలను సేకరించి ఆన్‌లైన్‌ చేస్తున్నారు.ఈ సర్వేలోకార్యదర్శులు రాములు, కవిత, సరిత మహిపాల్‌రెడ్డి, మురళిలు ఉన్నారు.

 మంగళపర్తి, కుకునూర్‌ గ్రామాల్లో సర్వే

 వెల్దుర్తి: గ్రామాల్లో ఆస్తుల నమోదు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ఇన్‌చార్జి డీపీవో, డ్వామా పీడీ శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని మం గళపర్తి, కుకునూర్‌ గ్రామాల్లో చేస్తున్న ఆస్తుల నమోదు ప్రక్రియను జడ్పీటీసీ రమేశ్‌గౌడ్‌తో కలిసి  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భవనాలు, ఖాళీ స్థలాల కొలుత లు, వివరాల నమోదుపై స్థానిక అధికారులు, పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సూచించిన వరకు పూర్తి స్థాయి కొలుతలు చేపట్టి వివరాలు  నమోదు చేయాలన్నారు. ప్రజలకు ఆనుమానాలు వ్యక్తం చేస్తే వారికి పూర్తి సమాచారం అందజేయాలన్నారు. భూ తగాదాలు లేకుండా, ఆస్తుల వివరాలను నమోదు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఇందులో భాగంగా వ్యవసాయేతర భూముల వివరాలను నమోదు చేస్తున్నమన్నారు. కార్యదర్శులు సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామనితెలిపారు. వీరి వెంట ఎంపీడీవో జగదిశ్వరాచారి, ఎంపీవో తిరుపతిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు ఉన్నారు. 

ఇంటి వివరాలు నమోదు తప్పని సరి

చేగుంట:ప్రతి ఒక్కరూ తమ ఇంటి  వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌ పేర్కొన్నారు.చేగుంటతో పాటు చందాయిపేట  గ్రామా ల్లో ఇంటింటి సర్వేలు సోమవారం నిర్వహించారు. చేగుంటలో నిర్వహించిన ఇంటింటి సర్వే నమోదు వివరాలను ఎంపీపీ శ్రీనివాస్‌ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉమాదేవి,జూనియర్‌ అసిస్టెంట్‌ విజయ్‌కుమార్‌,ఈవో రాణి ఉన్నారు.