గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Oct 05, 2020 , 00:46:04

చురుగ్గా ఆస్తుల నమోదు సర్వే

చురుగ్గా ఆస్తుల నమోదు సర్వే

అధికారులకు ప్రజలు సహకరించాలి

జిల్లా ఇన్‌చార్జి డీపీవో శ్రీనివాస్‌

రామాయంపేట: ఇంటికి వచ్చిన సర్వే అధికారులకు సహకరించి వివరాలను తెలుపాలని జిల్లాడీఆర్‌డీవో, ఇన్‌చార్జి పంచాయతీరాజ్‌ జిల్లా అధికారి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఆదివారం రామాయంపేట మండంలోని డి.ధర్మారం, దామరచెర్వు, ఝాన్సీలింగాపూర్‌ గ్రామాల్లో జరుగుతున్న ఇంటింటికీ నిర్వహిస్తున్న సర్వేకు హాజరై  సూచనలు సలహాలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  ఇండ్లలో ఉండే మహిళలు తమ ఇంటి వివరాలను సర్వే అధికారులకు తెలుపాలని వివరాలు ఆన్‌లైన్‌లోనే పొందు పర్చుతామన్నారు.  కరెంట్‌ బిల్‌, ఇంటి కొలుత లు, ఆధార్‌ కార్డు, పట్టాపాసుపుస్తకం, జనాభా  వివరాలను తెలుపాలన్నారు. ఇంటి వివరాలను ఆన్‌లైన్‌ చేసి ప్రతి ఒక్క ఇంటి యజమానికి ప్రభుత్వం పాసుపుస్తకాలను అందజేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు పంబాల జ్యోతి, బొడ్డు శంకర్‌, పడాల శివప్రసాద్‌ రా వు, కార్యదర్శులు, ఎంపీవో గిరిజారాణి, మాజీ సర్పం చ్‌ బాజ సిద్ధ్దరాములు తదితరులున్నారు.

సర్వేకు సహకరిం చండి

   నిజాంపేట:  మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఇంటి వివరాలతో పాటు వ్యవసాయేతర భూములను ఆన్‌లైన్‌లో నమో దు చేసుకోవాలని, ఇంటింటికీ సర్వే చేస్తున్న పంచాయతీ కార్యదర్శి,అధికారులకు సహకరించాలని ఎంపీపీ సిద్ధిరాములు అన్నా రు. ఆయన మండలంలోని నస్కల్‌ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ప్రేమలత చేపట్టిన ఇంటి వివరాల నమోదు కార్యక్రమంలో పాల్గొని మా ట్లాడారు.అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తమ విధిగా ఆధార్‌కార్డు,ఫోన్‌ నంబర్లతో పాటు ఇండ్లు,  ఖాళీ స్థలాలు, నిర్మాణ స్థలాలను చూపించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌నాయకుడు నగేశ్‌, గ్రామస్తులు 

ఉన్నారు.

ప్రతి ఒక్కరూ  వివరాలు నమోదు చేసుకోవాలి ఎంపీడీవో ఉమాదేవి

చేగుంట:ప్రతి ఒక్కరూ తమ ఇంటి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చేగుంట ఎంపీడీవో ఉమాదేవి పేర్కొన్నారు. మండల పరిధిలోని చెట్లతిమ్మాయిపల్లి, నడిమితాండ , పోతాన్‌పల్లి, పోతన్‌శెట్టిపల్లి, పెద్దశివునూర్‌ గ్రామాల్లో నిర్వహించిన ఇంటింటి సర్వేలో  ఎంపీడీవో పాల్గొని వివరాల నమోదును పరిశీలించారు. కార్యక్రమం లో వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.


logo