బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Oct 05, 2020 , 00:42:27

కిక్కిరిసిన ఏడుపాయల

కిక్కిరిసిన ఏడుపాయల

వనదుర్గమ్మను దర్శించుకున్న భక్తులు 

పాపన్నపేట : మొక్కులు తీర్చే ఓయమ్మ... ఏడుపాయల దుర్గమ్మ అంటూ భక్తులు వన దుర్గాభవానీ మాతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని రీతిలో ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆరు నెలలుగా కరోనా నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య చాలా తక్కు వగా ఉండేది. ఇటీవల లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిం చడంతో ఈ వారం మాత్రం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో  భక్తులు తరలి వచ్చారు. గంటల తరబడి క్యూలో నిలబడి దుర్గమ్మను దర్శించుకున్నారు. ఏడుపాయలకు చేరుకున్న భక్తులు తలనీలాలను సమర్పించి, మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేశారు.   

ఆలయంలో కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తున్నారు. ప్రతి భక్తుడు విధిగా మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో శ్రీనివాస్‌, సిబ్బంది సూర్య శ్రీనివాస్‌, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారికి వేద బ్రాహ్మణులు నరసింహాచారి, శంకర్‌శర్మ, పార్థీవశర్మ, రాజశేఖర్‌శర్మ తదితరులు పూజలు నిర్వహించారు. కాగా, ఏడుపాయల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట పోలీసులు  బందోబస్తు చర్యలు చేపట్టారు. logo